- రిబ్బన్ కట్ చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న

నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండల కేంద్రంలో ఖాసీంపేట గ్రామానికి చెందిన నరేష్ మధుమిత శ్రీ లక్ష్మీ నరసింహ ఆప్టికల్ సేవా కేంద్రాన్ని గురువారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ పేద ప్రజలకు పయోవృద్ధులకు దూర ప్రాంతాలకు కరీంనగర్ జిల్లా కేంద్రాలకు పోకుండా అందుబాటులో మన మండల కేంద్రంలో ప్రారంభించడం పై వారి దంపతులకు వెంకన్న అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా మండలం లోని పేద ప్రజలు ఈసేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులు కట్టలేని ప్రజలు ఈ ఆప్టికల్ కేంద్రంలో కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు చేసుకొని తక్కువ ధరలకే కంటి అద్దాలు పొందవచ్చు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కారోబార్ మాధవరావు, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల ప్రభాకర్, గొల్లపెల్లి రవి, కవ్వంపెల్లి రాజయ్య, రామంచ ఈదయ్య, వెదిరే పర్శరం, చిలుముల లక్ష్మణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

