Thursday, March 19, 2026

ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

నేటి సాక్షి, మెట్ పల్లి (గోరుమంతుల నరేందర్) : పట్టణంలోని బోయవాడలో బుధవారం ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. స్వామి వారి ఆలయ నిర్మాణం జరిగి ముప్పై సంవత్సరాలు పూర్తి ఆయిన సందర్బంగా కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపారు. ఉదయం నుండి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలూ, సత్యనారాయణ స్వామి కథలు ప్రత్యేక అభిషేకము కార్యక్రమం ఘనంగా చేపట్టారు. సామూహిక సత్యనారాయణ వ్రతం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పరిమి నరసయ్యగంగపుత్ర సంఘ అధ్యక్షులు ఆర్మూర్ నరేందర్, వాల్గొట్ పురుషోత్తం, ఆర్మూర్ రాజేష్, ప్రోహార్ హేమాచందర్, గుండు నాగేష్, సురేష్, లక్ష్మణ్ ప్రవీణ్, తోపారపు నాగయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News