
నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీ మన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు జగన్మోహన్చార్యులు, వేద పండితులు మరన్గంటి కళ్యాణ చార్యుల వేదమంత్రోచ్చారణలతో స్వామి వారి కళ్యాణం కన్నులపండుగగా జరిగింది. కళ్యాణ అనంతరం భక్తులు స్వామి వారికి ఓడి బియ్యం, కుడుకలు, కనుములు అందజేశారు. తర్వాత స్వామివారిని తులాభారం చేశారు. అనంతరం భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, సామల్ల వేణు, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రఘునాథ చార్యులు, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, నాయకులు, యువకులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.



