- సంక్రాంతి సందర్భంగా అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
- ఉత్సవాలలో ఎలాంటి లోటు రానివ్వద్దు
- గతంలో ఎన్నడూ లేనట్టుగా ఉత్సవాల నిర్వహణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు
- అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు అన్ని శాఖలు తోడ్పాటు అందించాలని కోరిన ఎమ్మెల్యే
నేటి సాక్షి ప్రతినిధి తి(రుపతి జిల్లా) : చంద్రగిరి గ్రామ దేవత శ్రీ మూలస్థానం ఎల్లమ్మ సంక్రాంతి ఉత్సవాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అపూర్వంగా నిర్వహించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు అన్నారు.ఈ నెల 13 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు నిర్వహించనున్న సంక్రాంతి ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఆవరణలో ఎంయల్ఏ నాని వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, స్థానికుల సమన్వయంతో ఉత్సవాలలో ఎలాంటి లోటు రానివ్వకూడదని చెప్పారు. ఉత్సవాలను గతంలో ఎన్నడూ నిర్వహించనంత వేడుకగా నిర్వహించాలని సూచించారు. ఆలయమంతానే కాక అన్ని ప్రధాన వీధులలో విద్యుత్ దీపాల అలంకరణ చేయాలన్నారు. చంద్రగిరి గ్రామపంచాయతీ వారు అమ్మవారి ఆలయ పరిసరాలతో పాటు పట్టణమంతా పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. వాలంటీర్లను ఏర్పాటు చేసి ఆలయం వద్ద క్యూలైన్లను క్రమబద్ధీకరించాలని తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ శాఖ వారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. ఏదైనా తప్పని పరిస్థితులలో విద్యుత్ మంత్రాలయం కలిగితే సత్యం మాయం ప్రత్యమ‌్నాయం సిద్ధం చేసుకోవాలన్నారు. అమ్మవారి కొండ చుట్టూ ఉత్సవం సందర్భంగా పోలీస్ శాఖ వారు గట్టిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అమ్మవారి ఉత్సవాలు ఇంత అద్భుతంగా ఉండాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించి నిర్వహించాల్సిన అవసరం ఉందని అందరికీ విజ్ఞప్తి చేశారు. అమ్మవారి వాహనాన్ని మోసే వాహన బేరర్లకి ఉత‌్సవాల సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేయనున‌్నట‌్టు చెప్పారు. అమ్మవారి ఉత్సవాలలో వాహనాలు మోయటం వారు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం అంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు గ్రామ ప్రముఖులు కూటమి పార్టీల నాయకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

