ఇందిరమ్మ వరద ప్రవాహ కాలువ పరిధిలోని ఆయకట్టు రైతులకు, గంగా పుత్రులకు విజ్ఞప్తి…
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటకు కాకతీయ కాలువ, జోన్ 2 చివరి ఆయకట్టు కొరకు (LMD ఎగువ) వరద కాలువ కిమి 88.470 నుండి లింక్ కెనాల్ ద్వారా కాకతీయ కాలువకు, వరద కాలువ ద్వారా మరికొన్ని నిమిషాలలో సాగునీరు విడుదల చేయబడుతుంది… కాలువ వెంబడి ఉన్న సాధారణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రమాదాలకు లోనూ కావద్దని విజ్ఞప్తి… విలువైన సాగునీటిని వృధా చేయకుండా ఆయకట్టు రైతులందరూ పొదుపుగా వాడుకొని నీటిపారుదల శాఖతో సహకరించాలని విజ్ఞప్తి…





