జాతరకు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించినఎమ్మెల్యే పులివర్తి నాని
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
చంద్రగిరి మండలం పరిధిలోని మిట్టప్యాలెం పంచాయతీ సమీపంలోని మేదర సంఘం ఆధ్వర్యంలో ని లొప్ప్ర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ మల్లాలమ్మ తల్లి జాతరకు మేదర సంఘం సభ్యులు ఆహ్వానం మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన మేదర సంఘం సభ్యులు, మహిళలు. శ్రీ శ్రీ శ్రీ మల్లాలమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గఅనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ మలాలమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గoలోని ప్రజలందరూ ఆరు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేసిన మేదర సంఘం సభ్యులు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





