Wednesday, April 1, 2026

శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమం

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి…!!!

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :

వనపర్తి నియోజకవర్గంలో శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీరంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా వనపర్తి సంస్థానాధీషులు ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది.వనపర్తి సంస్థానాధీషులు సాంప్రదాయ బద్ధంగా ఘనంగా నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 అడుగుల ఎత్తు ఉండే రతాన్ని ప్రత్యేకంగా ఊరేగించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు గురువారం రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది.తెలంగాణ ప్రజలకు వనపర్తి నియోజకవర్గ ప్రజలకు శ్రీ రంగనాయక స్వామి ఆశీస్సులు ఉండాలని మొక్కుకోవడం జరిగింది శ్రీరంగాపురం మండల కేంద్రంలో గెస్ట్ హౌస్ గాని రోడ్లు, పార్కులు గాని రిపేరు చేయవలసి ఉంది మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఒక కోటి 50 లక్షలు తో మినీ ట్యాంక్ బండ్ గాని చరిత్ర ఆత్మక దేవాలయం చుట్టూ టూరిజం డెవలప్మెంట్ చేయవలసి ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సహకారంతో శ్రీరంగాపురం దేవాలయానికి 10 కోట్లు కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలోనే వనపర్తికి సీఎం వచ్చినప్పుడు టెంపుల్ పరిసరాలను అన్ని డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తాం అని మీడియా ముందు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీరంగాపురం మండల ప్రజలు భక్తులు జిల్లా నాయకులు మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News