నేటిసాక్షి, హుజురాబాద్ (రాఘవుల శ్రీనివాసు):
స్థానిక హుజురాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ గణిత శాస్త్ర పితామహుడు శ్రీ.శ్రీనివాస రామానుజన్ గారి 136 వ జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఈ సందర్భముగా కళాశాల గణిత శాస్త్రం అధ్యాపకులు జితేందర్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు జిజ్ఞాస పరీక్ష నిర్వహించి ప్రథమ, ద్వితీయ విజేతలను ప్రకటించారు. ఇట్టి కార్యక్రమం మొత్తం కళాశాల ప్రిన్సిపాల్ వి. అంజనేయరావు ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జరిగింది. కార్యక్రమం ప్రారంభంలో కళాశాల ప్రిన్సిపాల్ వి. అంజనేయరావు శ్రీ శ్రీనివాస రామానుజన్ ఫోటో కు పూలమాల వేసి నివాళులర్పించి విధ్యార్థులనుద్దేచించి గణితశాస్త్రం లోగల చిన్న చిన్న తప్పులను, మెళుకువలను మరియు రామానుజన్ గారి గురించి పిల్లలకుచెప్పారు. కార్యక్రమం చివరిలో ప్రథమ ద్వితీయ విజేతలను అభినందించి వారికి మేమేంటోలు అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కళాశాల అధ్యాపకులు, సుహాసిని, వాసుదేవరావు, తులసీ దాసు, విజేందర్ రెడ్డి, మురళీ మోహన్, రమణ ,విధ్యార్థులు పాల్గొన్నారు.