Tuesday, March 17, 2026

పుష్కర కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న శ్రీరాములు అందెల

  • వసంత పంచమి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని సరస్వతి దేవి ఆలయాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టాలి
  • శ్రీరాములు అందెల

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ టెలిఫోన్ కాలనీలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలోనిర్వహిస్తున్నటువంటి పుష్కర కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆర్.కె.పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డితో కలిసి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా… ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి శ్రీరాములుని ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ…. అందరికీ ముందస్తు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న వసంత పంచమి దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని సరస్వతీ దేవి ఆలయాలలో రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధీరజ్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు కరుణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News