నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): హుజురాబాద్ ప్రజల గుండె చప్పుడు. మల్కాజ్‌గిరి ప్రజల మనస్సులో స్థానం పొందిన ప్రజా నాయకుడు తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్రతో ముందుకు సాగిన పోరాట యోధుడు పార్లమెంట్ సభ్యులు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ జన్మదిన సందర్భంగా శామీర్ పెట్ లోని నివాసంలో నిర్వహించినటువంటి జన్మదిన వేడుకల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొని ఈటల రాజేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తర్రే మల్లేష్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు తులసి ముఖేష్ ముదిరాజ్, కందుకూరు మండల బిజెపి నాయకులు వెంకటేష్ ముదిరాజ్ మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.





