
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాఘా పౌర్ణమి రోజున శ్రీవాసవి అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. నార్ల రాజేందర్-రజిని దంపతుల కుమారుడు, కోడలు అచ్యుత్-శ్రావికల పెళ్లిరోజు మరియు వారి మనమడు హన్షిత్ పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణం లోని పలువురు రైస్ మిల్ యజమానులు, వైశ్య సంఘ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.





