ముఖ్యఅతిథిగా హాజరైన వొడితల ప్రణవ్
నేటిసాక్షి, కమాలాపూర్:
కమలాపూర్ కేంద్రం లోని పనగట్ల ప్రాంతం లో స్టార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీకి ముఖ్యఅతిథిగా హాజరైన హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ మాట్లాడుతూ మహిళల్లో దాగి ఉన్న కలను బయటికి తీసే ప్రయత్నం చేసిన స్టార్ యూత్ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థినీలు, మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మగవారికి చాలా రకాలుగా ఆటలు ఉంటాయని కానీ మహిళలల్లో ఉత్సాహాన్ని నింపి పండగ వాతావరణం నెలకొల్పే విధంగా ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వృద్ధులు విద్యార్థినులు, చిన్న పిల్లలు వేసిన ముగ్గులను చూసి ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు.అదేవిధంగా ప్రతి సంవత్సరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని ఆయన స్టార్ యూత్ కి సూచించారు. అనంతరం ముగ్గుల పోటిల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి బైరి వైష్ణవి ( డ్రెస్సింగ్ టేబుల్ ), ద్వితీయ బహుమతి చెనుమల్ల నవ్య శ్రీ (కూలర్ ), తృతీయ బహుమతి కొంతం ప్రత్యుష ( డిన్నర్ సెట్ ). ఈ కార్యక్రమంలో కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్ ,మాజీ ఎంపీపీ మాట్ల రమేష్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా. మౌటం కుమారస్వామీ, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూడ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ వాసాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పుల్లూరి శ్రీనివాస్ రావు, పోడేటి బిక్షపతి, బొల్లం రాజిరెడ్డి, రాం చందర్ మాజీ సర్పంచ్ లు, మాట్ల రవీందర్, కేత్తే రవి, స్టార్ యూత్ అధ్యక్షులు కొంతం క్రాంతి కుమార్, మరియు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు





