- టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్

నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ గౌరవ అధ్యక్షుడు కట్ట నాగభూషణ చారి మాట్లాడుతూ.. గత ఏప్రిల్ 2024 నుండి ఇప్పటివరకు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు విరమణ సందర్భంగా చెల్లించవలసినటువంటి గ్రాట్యుటీ కమ్యూ టేషన్ వేల్యూ ఆఫ్ పెన్షన్ జిపిఎఫ్ మరియు ఇతర బెనిఫిట్స్ ఇప్పటివరకు కూడా చాలామంది పెన్షనర్స్ కు మంజూరు చేయకుండా ఈ కుబేర్ లో పెండింగ్ పెట్టి పెన్షనర్స్ ను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడము వలన ఇటువంటి చర్యను తట్టుకోలేని కొంతమంది పెన్షనర్స్ మరణానికి గురి కావడం ప్రభుత్వానికి తగదని హితవు పలుకుతూ పెన్షనర్స్ బెనిఫిట్స్ వెంటనే మంజూరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేసినారు. అదే విధంగా జూలై 2023 నుండి అమలు చేయాల్సిన నూతన పి ఆర్ సి ని ఇప్పటివరకు నివేదిక తెప్పించుకోకుండా వాయిదా వేయడం సరియైనటువంటి కాదని నూతన పి ఆర్ సి ని ప్రకటిస్తూ జూలై 2023 నుండి వెంటనే అమలు చేయాలని పెండింగ్లో ఉన్న ఐదు డి ఏ లను సత్వరమే మంజూరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరినారు.




