- కరాటే పోటీల్లో లో పాల్గొన్న గాయత్రి విద్యానికేతన్ విద్యార్థినీ
నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) :
పల్లెల నుండి ప్రపంచ స్థాయి వరకు ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన కరాటే సెలక్షన్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని డి. స్పూర్తి జిల్లాలో సెలెక్ట్ అయి డిసెంబర్ 30 నుండి జనవరి 2వ తేదీ వరకు హైదరాబాద్ యూసుఫ్ గూడా, లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పాల్గొని, ప్రశంస పత్రము పొందినట్లు కరాటే మాస్టర్ మల్యాల రామస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. డి. స్పూర్తి ని గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ అల్లెంకి రజనీ దేవి, ప్రిన్సిపల్ విజయ్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

