Thursday, April 2, 2026

జిల్లాలో వివిధ శాఖల పరిధిలో పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను మార్చి చివరి తేదీ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి

  • వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ఈ డబ్ల్యూ ఐ డి సి శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ఈ డబ్ల్యూ ఐ డి సి శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను మార్చి చివరి తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ ఫండ్స్ కింద పంచాయతీ రాజ్ శాఖకు కేటాయించిన 44 పాఠశాలల్లో, ఈడబ్ల్యుఐడీ సిటీ కేటాయించిన 20 అంగన్వాడీ భవనాల్లో, ఆర్ అండ్ బి కి కేటాయించిన నాలుగు అంగన్వాడి భవనాల్లో మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా, పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బి శాఖల పరిధిలో ఎఫ్ డి ఆర్ నిధులతో చేపట్టిన సిసి రోడ్ల పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి చేయడమే కాకుండా వాటికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కూడా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక మన ఊరు మనబడి కి సంబంధించి తుది దశకు చేరుకుని బిల్లులు రాక పెండింగ్లో నిలిచిపోయిన పాఠశాల భవనాలను గుర్తించి వాటిని వేగంగా వాడుకలోకి తెచ్చేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, ఆర్ అండ్ బి డి ఈ సీతారామస్వామి, ఈడబ్ల్యుఐడీసీ ఈఈ, ఆయా శాఖల డి ఈ లు ఏఈలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News