Thursday, April 2, 2026

తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

  • మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్

నేటి సాక్షి, వేమనపల్లి; గ్రామాలలో గల సమస్యలని పరిష్కరించడానికి బుధవారం రోజు మండల ప్రత్యెక అధికారి వి.శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీవో కుమారస్వామి,తహసీల్దార్ కె.రమేష్ లతో కలిసి మండల సాధారణ సమావేశం నిర్వహించారు.ఇట్టి సమావేశంలో అన్ని గ్రామలలో ఉన్న సమస్యలపై చర్చించి ముఖ్యంగా ఎండాకాలంలో త్రాగు నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు అదేశించినారు.అలాగే ఇంటి పన్ను బకాయి వంద శాతం పూర్తి చేయాడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అర్హులు జాబితా సంసిందంగా తయారు చేయాలని ఆదేశించారు.మండలంలోని గ్రామలలో నర్సరీలు,కాంపౌండ్ వాల్స్ పశువుల పాకలు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలని,ఉపాధి హామీ పని ప్రదేశాల్లో నీడ,తాగునీటి వసతి కల్పించాలి అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఇట్టి కార్యక్రమానికి ఎంపీఓ శ్రీనివాసరెడ్డి,ఎపిఎం ఉమారాణి,పీఆర్ఏఈ ప్రదీప్,ఆర్ డబ్లుఎస్ ఏఈ సాయికిరణ్,హెల్త్ సూపర్వైజర్ బాపు,అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శిలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News