Tuesday, March 10, 2026

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు

నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టిఎన్ రమేష్
కామారెడ్డి జిల్లాలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు, ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ, మండల స్థాయి అధికారులు మొదలు, జిల్లా స్థాయి అధికారులతో, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల,లబ్ధి చేకూర్చేందుకు, కృషి చేస్తున్నామని, జిల్లాలో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు మీ సేవలో దరఖాస్తు చేసుకునేందుకు కలుగుతున్న ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గురువారం రోజు జిల్లా కలెక్టరేట్లో దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో, జిల్లా సమీకృత కార్యాలయాల సమావేశ మందిరంలో, అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల, అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని దివ్యాంగులకు, రుణాలు ఇప్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిని, కలెక్టర్ ఆదేశించారు. రెండు పడకల గదుల ఇండ్ల కేటాయింపులో, ఐదు శాతం దివ్యాంగులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని, అధికారులకు కలెక్టర్ తెలిపారు. బస్సు, రైల్వే పాసుల విషయంలో, సంబంధిత శాఖ అధికారులకు లేఖలురాస్తామని, సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని రజిత, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సురేందర్, డిఇఓ రాజు సోన్నాయిలా, ఎల్ డి ఎం రవికాంత్, జెడ్పి సీఈవో చందర్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News