- కేసు నమోదు చేసిన ఎస్ఐ వీరభద్రరావు
నేటి సాక్షి, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనివారం రోజున 1:15 గంటలకు కంఠత్మకూర్ గ్రామానికి చెందిన మంతెపూరి రాజు మరియు తన మిత్రుడైన బుస్స సురేందర్ లపై రాళ్ళతో దాడి జరిగింది. వృత్తిరీత్యా తన గ్రామం నుండి హైదరాబాద్ కు ద్విచక్ర వాహనంపై వెళ్లుచుండగా అంబాల, నాగారం మార్గ మధ్యలో కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శివాజీ వారిని ఆపి పాత కక్షలను మనుసులో ఉంచుకొని రాజు పై రాళ్ళతో దాడి చేస్తూ, నానా బూతులు తిట్టినాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్ చేయడం జరిగిందని ఎస్సై ఈ. వీరభద్రరావు తెలిపారు.

