Sunday, March 15, 2026

ఫీల్డ్ అసిస్టెంట్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకేర గ్రామపంచాయితీలో గ్రామసభ జరుగుతుండగా కొందరు వ్యక్తులు ఫీల్డ్ అసిస్టెంట్ పై అధికారుల ముందే దాడి చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అసిస్టెంట్ సంఘం అధ్యక్షులు నక్క రాజన్న, గౌరవ అధ్యక్షులు ఈద లింగయ్య లు ఒక ప్రకటనలో కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్ పై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టి బాధితునికి న్యాయం చేయాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News