Sunday, March 29, 2026

అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు

  • జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి కే.జై సింగ్

నేటి సాక్షి – కోరుట్ల (రాధారపు నర్సయ్య) : ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా పట్టా మరియు ప్రభుత్వ భూముల నుండి మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అడిషనల్ డైరెక్టర్ ( ఏ డీ) కే. జై సింగ్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోరుట్ల మండలం లోని ఏకీన్ పూర్ మరియు అయిలాపూర్ గ్రామాలలోని మట్టి గుట్టలను పరిశీలించారు. అక్రమంగా మట్టిని తరలించే వారిపై అపరాధ రుసుం విధింపుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడీ తో పాటు మండల తహసిల్దార్ కిషన్, గిర్ధావర్ రాజేందర్ రావు,మండల సర్వేయర్ కుమారస్వామి ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News