నేటి సాక్షి, వేమనపల్లి:
మండలంలోని ఫర్టిలైజర్ షాపులలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్ అన్నారు. గురువారం గొర్లపల్లి,వేమనపల్లి గ్రామంలోని ఫెర్టిలైజర్ షాపులు,గోదాములను మండల వ్యవసాయ అధికారి వీరన్నతో కలిసి దాడులు నిర్వహించి స్టాకు రిజిస్టర్లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడువు ముగిసిన విత్తనాలు, లేబుల్స్ లేనివి నిల్వ ఉంచిన లూజ్ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సరైన రసీదులు తీసుకోవాలని తెలిపారు. పంట వచ్చేవరకు వాటిని భద్రపరుచుకోవాలని కోరారు. రైతులకు ఇబ్బందులు ఉంటే డయల్ 100కు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు.





