- కమలాపూర్ సబ్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీ
- సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా
నేటిసాక్షి, కమలాపూర్ :
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ జంక్షన్ వద్ద వాహన తనిఖీ నిర్వహించి వాహన ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి ఇన్సూరెన్స్ లేని పలు వాహనాలకు జరిమానా విధించటంతో పాటుగా నంబర్ ప్లేట్లు లేని పలు వాహనాలకు నంబర్లు వేయించటం జరిగిందని వాహన ధ్రువీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడిపినా, మైనర్లకు వాహనాలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులకు పోలీసులు హెచ్చరించటం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నందున కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను రోడ్లపై నడపవద్దని, పొలాల వద్దనే ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ అమర్చుకోవాలని ట్రాక్టర్ డ్రైవర్లు, రైతులకు సూచించటం జరిగింది. వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖకు సహకరించాలని మండల ప్రజలకు సీఐ ఇ. హరికృష్ణ తెలిపారు.