• ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది ఉండాలి
• పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలి
• వేసవి ప్రారంభం కావడంతో త్రాగునీరు కొరత లేకుండా చూడాలి
• పరీక్షా కేంద్రాల్లో గాలి, వెలుతురు ఇబ్బంది లేకుండా చూడాలి
• ద్వి చక్ర వాహనదారులు విద్యార్థులకు సాయం అందించాలి
• వైఎస్ఆర్ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రేపటి నుంచి పదవతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి.. ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన విద్యాశాఖ, రోడ్డు రవాణా శాఖ, పోలీసు శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో పాటు పరీక్ష రాసేందుకు వచ్చే పిల్లలకు అన్ని రకాల మౌళిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే పరీక్ష రాసేందుకు వెళుతున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ పిల్లలకు అవసరమైన పరీక్షా సామాగ్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున పలుచోట్ల పంపిణీ చేయడం జరిగింది. పరీక్షా సామాగ్రి కొనలేని పేద విద్యార్థులు ఇంకా ఎవ్వరైనా ఉంటే వారికి కూడా సాయం చేయడానికి సిద్ధంగా వున్నాం.
అధికారులు చేపట్ట వలసిన సౌకర్యాలు:
-ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.
-పరీక్షల సమయానికి అనుగుణంగా అన్ని మార్గాలలో ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతూ పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
-పరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష రాసేందుకు వచ్చే పిల్లలకు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా సురక్షిత మంచి నీరు అందుబాటులోకి తీసుకు రావాలి.
-పరీక్షా కేంద్రానికి పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులను రోడ్లపై ఎండలో వదలేయకుండా సమీపంలోని పచ్చని చెట్ల కిందకు అనుమతించాలి.
చెట్లు లేని చోట నీడను కల్పించేందుకు సౌకర్యవంతమైన తాత్కాలిక ఏర్పాట్లు చేసి అందులో వేచి ఉండేందుకు అవకాశం కల్పించాలి.
-ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారిశుధ్యం, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కొరత లేకుండా చూడాలి.
-పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఉక్కపోతకు గురవకుండా ఫ్యాన్లు, వెలుతురు బాగుండేలా హై ఓల్ట్స్ బల్బులను ఏర్పాటు చేసి ఆ సమయంలో విద్యుత్తు
అంతరాయం కలగుకుండా చర్యలు తీసుకోవాలి.
-ఆర్టీసీ డ్రైవర్లు పరీక్షల సమయంలో నిబందనలను పక్కనబెట్టి మానవత్వంతో విద్యార్థులను పరీక్షా కేంద్రాల వద్దకు చేర్చాలి. (స్టాపింగ్ లేకున్నా
అవసరమైన చోట వాహనం నిలిపి వారిని తీసుకురావడం).
-పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల ఆవేశంతో కాకుండా మానవత్వంతో వ్యవహరించాలని
సూచిస్తున్నాం.
గమనిక: పరీక్షల సమయం ఆసన్నమైనందున ద్వి చక్రవాహన దారులు మానవత్వంతో ఆలోచించి పరీక్షా కేంద్రాలకు కాలి నడకన వెళుతున్న పిల్లలను తమ వాహనంలోకి ఎక్కించుకుని సకాలంలో పరీక్షా కేంద్రాల వద్ద విడిచి పెట్టాలని విన్నవిస్తున్నాం.




