Sunday, March 15, 2026

పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు

  • ఇంటర్ పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలి
  • మార్చి 5 నుంచి పరీక్షలు
  • సమీక్ష నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణ పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ఫిబ్రవరి 03 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు :
జనరల్ అలాగే వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే నెల 03-02-2025 నుంచి 22-02-2025 వరకు ఉదయం 09.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 02.00 గంటల నుంచి 05.00 గంటల వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ఇంటర్ పరీక్షలు మార్చి నుంచి :
05-03-2025 నుంచి 25-03-2025 వరకు ఉ. 9.00 నుండి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఫస్టియర్ విద్యార్థులు 5,065 మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,245 మొత్తం 9,310 మంది పరీక్షలకు హాజరుకానున్నారని కలెక్టర్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అన్నారు. ప్రభుత్వం పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని, ప్రతి కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం స్థాయిలో వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వ జేసెందుకు పోలిస్ స్టేషనలో తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నపత్రాలకు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని, పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, సెంటర్లలో మాస్ కాపీయింగ్ మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను,పరీక్షలు జరిగే రోజుల్లో ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు వారికి ధైర్యం చెప్పాలని అన్నారు. జిల్లాలో పరీక్షలు నిర్వహించే పరీక్షలకు ప్రశ్న పత్రాలను పోలిసు వారి బందోబస్తు వుంచి తీసుకొని వెళ్లాలని,జిల్లాలోని రెవెన్యూ శాఖ పరీక్షా కేంద్రాలకు ప్లైయింగ్ స్వ్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరు పై నిఘా వుంచాలని,144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు,ఫ్యాన్లు,లైట్లు సరైన విధంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, వెలుతురు వుండేలా చర్యలు తీసుకోవాలని,ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను సరిగా సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చేపట్టాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్,డీఈఓ జగన్ మోహన్ రెడ్డి,డి.ఎం.హెచ్.ఓ డా. రజిత,ఆర్.టి.సి,సెస్,పోస్టల్ అధికారులు,తదితరులు పాల్గోన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News