Wednesday, March 11, 2026

కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా..

  • మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

నేటి సాక్షి-కరీంనగర్:
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు కారణాలు తెలుపకుండ అరెస్టు చేయడం పట్ల కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో..?, ఏ సెక్షన్ కింద అదుపులో తీసుకున్నారో..? ముందుగా చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కారణాలు ముందస్తుగా చెప్పక పోవడం రాజ్యాంగం ప్రకారం తప్పు అని, ఇది చట్టం ముందు నేరం అని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. కారణాలు ముందస్తుగా చెప్పకుండా, అకారణంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, వెంటనే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News