Monday, March 9, 2026

చదువు ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్య

నేటి సాక్షి, మెట్ పల్లి (నరేష్ దూలురి):
మండలంలోని వేంపేట గ్రామంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి చదువు పై ఇష్టం లేక సోమవారం ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 15 రోజుల క్రితం ఇంటికి వచ్చిన అనంతరం కాలేజీ కి వెళ్ళమని తల్లిదండ్రులు ప్రాదేయపడుతున్న చదువు పై ఇష్టం లేక వెళ్ళలేదు. సోమవారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్ళిన వారితో పాటు మృతుడు కూడా మధ్యాహ్నం వరకు పొలం పనులకు వెళ్లి వచ్చాడు. సాయంత్రం పనులు ముగించుకొని వచ్చిన తల్లి ఇంటి మేడ మీదకు వెళ్లి చూడగా సిద్ధార్థ రెడ్డి ఉరి వేసుకొని కనిపించగా తల్లి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి గమనించగా అప్పటికే మరణించాడు. చదువు ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి నరేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News