Saturday, March 14, 2026

ఎస్సీ బాలుర హాస్టల్లో అస్వస్థతకు గురై విద్యార్థి మృతి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 27 : వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో ఎస్సీ బాలుర హాస్టల్లో ఉడుముల భరత్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రోజు విధిగా ఉదయం ఐదున్నరకు లేచి కాల కృత్యాలు తీసుకుని ఏడు గంటలకు హాస్టల్ కాంపౌండ్ వాల్ లో స్టడీ అవర్స్ కూర్చొని చదువుకుంటూ ఏడు గంటల 9 నిమిషాల 40 సెకండ్లకు చదువుతూ అలాగే వెనుకలకు పడిపోయాడు. కూర్చున్న తోటి విద్యార్థులు పిడుసు అని తాళం చెవిల గుత్తి పెట్టి కాళ్లు చేతులు రాసి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడి నుండి మెరుగన్న వైద్యం కోసం నర్సింగాయపల్లి చిన్నపిల్లల హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకు వెళ్లిన వెంటనే డాక్టర్ పరిశీలించి బాలుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని చెక్ చేశాడు. బాలుడి కండిషన్ సీరియస్ గా ఉందని పల్స్ రేటు పడిపోయాయి కావున బాలుడు చనిపోయాడని డాక్టర్లు తెలియజేశారు. బాలుడు చనిపోయాడు. అని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు విషాదంలో మునిగారు . 4 నెలల క్రితం తండ్రి చనిపోగా, చిన్న వయసులో విద్యార్థి భరత్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తక్షణమే బాలుడి మృతదేహాన్ని తీసుకొని వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థి మృతదేహాన్ని నర్సింగాయపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ముందు ఉన్న రోడ్డుపై విద్యార్థి మృతదేహాన్ని ఉంచి విద్యార్థి సంఘాలు, బంధువులు ధర్నా చేస్తున్నారు. విద్యార్థి గ్రామ ప్రజలు ఏదుట్ల వారు డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు కలెక్టర్ వచ్చి కుటుంబ సభ్యులకు న్యాయం చేసేంతవరకు రోడ్డుపై విద్యార్థి మృతదేహాన్ని తరలించమని రాస్తారోకో నిర్వహించారు. భరత్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News