నేటిసాక్షి, రాయికల్ : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఈనెల14న నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలకు చెందిన పస్తం విష్ణు అత్యంత ప్రతిభ కనబరిచాడు. 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో నిలిచాడు. ఈనెల 23న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ తెలిపారు, విష్ణును కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్ , పాఠశాల పి. ఇ. టి మహేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.





