Saturday, March 14, 2026

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

  • ఎమ్మెల్సీ రహమత్ బేగ్

నేటి సాక్షి, మందమర్రి:- విద్యార్థులు లక్ష్యసాధన తో కృషి చేసి, ఉత్తమ ఫలితాలు సాధించాలని హైదరాబాద్ ఎమ్మెల్సీ రహమత్ బెగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని కస్తూర్బా ఉర్దూ మీడియం పదో తరగతి విద్యార్థులకు ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రహమత్ బెగ్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లపల్లి కార్పొరేటర్ జాఫర్ ఖాన్, ఏఐ ఎంఐఎం పట్టణ అధ్యక్షులు ఎండి షబ్బరొద్దీన్, నాయకులు నిజముద్దీన్, వాజీద్, యాఖుబ్, యూసుఫ్, సమీర్, హాఫిజ్,‌ సలీం, మున్నా లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News