Friday, March 20, 2026

విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూడాలి

  • గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

నేటి సాక్షి, ఇల్లందు :
ఇల్లందు మండలం రొంపేడు గ్రామం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీలతో ముచ్చటిస్తూ వారికి అందుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, పరిసరాలు, స్టోర్స్, వంట గదులను తనిఖీ చేసి సమస్యలను అడిగి స్వయంగా రాసుకున్నారు. ఈ తనిఖీలు భాగంగా తరగతి గదిలో విద్యార్థినీలతో మమేకమై విద్యార్థులు ఎలా చదువుతున్నారు? టీచర్లు పాఠాలు ఎలా చెపుతున్నారు? పాఠ్యాంశాల బోధన పట్ల అవగాహన కలుగుతుందా?మీరు ఎంచుకున్న లక్ష్యాలు ఏమిటి? మోనూ ఎలా ఉంది?అని తదితర విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థినిలు చదువుపై శ్రద్ధ చూపి ఉన్నత శిఖరాలను అవరోధించాలని, వసతి గృహంలో కానీ పాఠశాలలో కానీ ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారం అందించాలని ఆహారం వన్డే సిబ్బంది పరిశుభ్రంగా చేతులు కడుక్కొని ఆహార పదార్థాలను సిద్ధం చేయాలన్నారు.స్వచ్ఛమైన త్రాగు నీరు అందించాలని, నిరంతరం విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, ప్రతి విద్యార్థినీకు వ్యక్తిగత, పరిశుభ్రత, మానసిక వికాసం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని గమనిస్తూ అవగాహన కల్పించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి సబ్జెక్టు పై ఎలాంటి సందేహాలు ఉన్న సమాధానాలు చెబుతూ విద్య బోధనలు అందించాలని సూచించారు. వసతి గృహాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు నిత్యం గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకోవటానికి అన్ని సదుపాయాలు కల్పించాలని, దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఇల్లందు తాసిల్దార్ రవికుమార్, హాస్టల్ వార్డెన్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News