Wednesday, March 25, 2026

విద్యార్థులు సైన్స్ పై మక్కువ పెంచుకోవాలి

  • ఏఎంఓ మల్లారెడ్డి

నేటిసాక్షి/వాజేడు : విద్యార్థులు సైన్స్ పై మక్కువ పెంచుకోవాలని ములుగు జిల్లా ఏఎంఓ మల్లారెడ్డి అన్నారు వాజేడు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఏ ఎం ఓ పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పై మక్కువ పెంచుకోవాలని అన్నారు. నిజజీవితంలో విద్యార్థులకు సైన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్ర సాంకేతిక రంగాలలో జరుగుతున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు నూతన ఆవిష్కరణలు తయారు చేసేందుకు సిద్ధంగా ఉండాలని మల్లారెడ్డి అన్నారు విద్యార్థి దశలోనే సైన్స్ పై మక్కువ పెంచుకొని పూర్తిస్థాయిలో పాఠ్యాంశాలను చదువుతూ అదనంగా కావలసిన సమాచారాన్ని ఉపాధ్యాయులు, వార్తాపత్రికలు ,ఇంటర్నెట్ ద్వారా సేకరించి సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలు ఏర్పాటు చేసే విధంగా విద్యార్థుల కృషి ఉండాలని ఆయన అన్నారు.ఎగ్బిట్స్ తయారికి సహకరించిన సైన్స్ ఉపాద్యాయులు ఆనంద్, కుమార్ బాబులను ఆయన అభినందించారు.
ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలి. ఎం ఈ ఓ తేజావత్ వెంకటేశ్వరరావు విద్యార్థులు ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలని ఎంఈఓ తేజావత్ వెంకటేశ్వరరావు అన్నారు. సివి. రామన్ సముద్రంపై ప్రయాణం చేస్తూ అతి తక్కువ ఖర్చుతో రామన్ ఎఫెక్ట్ ని కనుక్కొని ప్రపంచానికి తెలియజేశారని ఆయన అన్నారు మన చుట్టూ అనేక అంశాలు సైన్స్ తో ముడిపడి ఉంటాయని మనం వాటిని గుర్తించలేకపోతున్నామన్నారు ప్రతి విద్యార్థి చూసే అంశాలను శాస్త్రీయ దృక్పథంతో చూస్తే అందులో నిగూఢమైన సైన్స్ ఉందని దాన్ని వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆలోచన విధానం ఉండాలని వెంకటేశ్వరరావు అన్నారు. రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారని విద్యార్థులకు ఎంఈఓ తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థులచే ఎగ్జిబిట్లు తయారు చేయడానికి ప్రోత్సహించిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. హెచ్ఎం ఆనందరావు
విద్యార్థుల ఆలోచనలు ఎప్పుడు స్థిమితంగా ఉండక మార్పు చెందుతూ ఉంటాయని వాటిని గుర్తించి ఉపాధ్యాయులు విద్యార్థుల ఆలోచనలు ఉపయోగపడే అంశాల వైపు మళ్ళించి వారిని ప్రయోజకులు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది అని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో రామన్ ఎఫెక్ట్ ని విపుళీకరించి నోబెల్ బహుమతి పొందిన సివి రామన్ గురించి భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన సేవల్ని ఆనందరావు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్వరూప్ సింగ్ మల్లయ్య ఆనంద్ రవి కుమార్ బాబు ప్రభాకర్ రాజేష్ రాజ్యలక్ష్మి అమ్మాజీ రాని వస్య మండలంలోని వివిధ పాఠశాల ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News