- జగిత్యాల సిడిపిఓ మమత
నేటిసాక్షి, రాయికల్: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే అభివృద్ది ఉంటుందని జగిత్యాల సిడిపిఓ మమత అన్నారు. రాయికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో, బేటి పడావో అనే కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పిల్లలకు మానసిక ఆరోగ్యము మరియు ప్రేరణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందు ఉంటూ భారత దేశ ప్రగతికి రథచక్రాలుగా మారాలని వారి అభివృద్ధి తో పాటు సమాజ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి సురేష్ మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో పిల్లలు అనేక రకాల ఆకర్షణలకి ముఖ్యంగా మొబైల్, ఫోన్, డ్రగ్స్ మరియు ప్రేమ అనే అంశాలకు ఆకర్షితులు కావద్దని, అదే వారి బంగారు భవిష్యత్తుకు ఆటంకం కలిగించుకుంటున్నారని వాటి నుంచి బయటపడి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని ఎన్ని రకాల అవంతరాలు వచ్చినా ఆకర్షణలకు లోను కాకుండా మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళ సాధికారత స్వప్న, తేజస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సఖి కేంద్రం కౌన్సిలర్ గౌతమి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పద్మావతి, సువర్ణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.





