Sunday, March 15, 2026

విద్యార్థులు అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- విద్యార్థులు పట్టుదల, ఏకాగ్రతతో చదువుతూ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ ఉషోదయ ఉన్నత పాఠశాల మైదానంలో కలాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్టెన్స్ (కెఐవైఈ), యార్లగడ్డ అభిరామ్ మెమోరియల్ గ్రామ సేవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ ఇండియా-2025 ఒక్క రోజు స్సేస్, డిఫెన్స్ ఎక్స్పో కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సి శివశంకర్ లతో కలిసి హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, విద్యార్థుల తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడంతో పాటు దేశ రక్షణలో తమ వంతు బాధ్యత నిర్వర్తించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇస్రో, సాంకేతికత రంగంలో చెందుతున్న అభివృద్ధి, స్పేస్లో మారుతున్న పరిణామాలపై విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శన ఏర్పాటు చేయడం విద్యార్థుల అదృష్టమని, ఈ అవకాశాన్ని వినియోగంచుకొని, విజ్ఞానాన్ని పొందవచ్చునన్నారు. ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో స్పేస్ అండ్ డిఫెస్స్ రంగాలను ఎంచుకొని, దేశ రక్షణలో పాలు పంచుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News