Wednesday, March 25, 2026

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వీడ్కోలు పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి. నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యార్థులు తమ జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను భరించి, వార్షిక పరీక్షలు మంచిగా రాసి మిమ్మల్ని చదివించిన, మీ తల్లిదండ్రులకు గొప్ప కానుకగా మీ విజయం ఉండాలని సూచించారు. అలాగే పాఠాలు బోధించిన టీచర్లకు, తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకోని రావాలన్నారు. జగిత్యాల జిల్లా ప్రిన్సిపాల్ అసోసియేషన్ అధ్యక్షులు వై. రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎదుగుదలకు, ఉన్నత స్థానాలకు ఎదగడానికి మంచి ఉద్యోగాలు చేయడానికి, ఏ రంగంలో అయినా సాధించడానికి చదివే ప్రాధాన్యతమని, ప్రతి ఒక్క విద్యార్థి దృష్టిలో ఉంచుకొని బాగా చదువుకొని గొప్ప మార్కులు సాధించాలని అన్నారు. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సరైన ప్రణాళికతో చదివి పరీక్షల విజయం తథ్యం అన్నారు. స్థానిక ఎస్సై ఎస్. సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి స్వంతగా పారితోషికం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. వేణు, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News