Tuesday, March 24, 2026

విద్యార్థులు చక్కగా చదివి, అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

  • విద్యార్థులు చదివిన పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి
  • భవిత సెంటర్లో ఉన్న చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు
  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మాత్రమే అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చదువుకోవడానికి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని చెప్పారు. గురువారం నిర్వహించిన వార్షికోత్సవానికి సంబంధించిన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు స్వయంగా గణితం పై కొన్ని ప్రశ్నలు సంధించి, సమాధానాలు రాబట్టారు. సరైన విధంగా గణిత సమస్యలను పరిష్కరించిన విద్యార్థులకు చాక్లెట్లు అందజేశారు.పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న వంటగది నిర్మాణానికి సంబంధించి ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. పాఠశాలలో ఉన్న పెండింగ్ పనుల పూర్తి చేయడానికి అంచనాల నివేదికను సమర్పించాలని ఆదేశించారు. భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్.భవిత కేంద్రంలోని బాలబాలికలకు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరపీ వంటివి వాటిలో చక్కగా శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ సిబ్బందికి సూచించారు. స్థానిక కేడిఆర్ నగర్ లోని మండల విద్యాధికారి కార్యాలయంలో భవిత (ప్రత్యేక అవసరాల బాల బాలికల జిల్లా వనరుల కేంద్రం) కేంద్రం ను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భవిత సెంటర్లో ఉన్న చిన్నారులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడారు. ప్రత్యేక అవసరాల పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వారి నైపుణ్యాలను తీర్చిదిద్ది స్పెషల్ స్కూల్ నుంచి నార్మల్ స్కూల్ కు పంపడానికి అన్నిరకాలుగా అవసరమైన విధంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల బాల బాలికలకు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరపీ వంటివి వాటిలో శిక్షణ అందించి ఇతర పిల్లలతో సమానంగా విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని భవిత కేంద్రాలకు స్పీచ్ థెరపీ కి సంబందించిన పరికరాలు అందిస్తానని కలెక్టర్ చెప్పారు. ఫిజియోథెరపీకి సంబంధించి వైద్య శాఖ నుంచి థెరపిస్టును పిలిపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యాశాఖ అధికారులు యుగంధర్, శేఖర్, బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఉమాదేవి, భవిత కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News