Sunday, March 22, 2026

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల స్టడీ ప్రాజెక్టులు ఎంపిక

నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్): ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరిఖని విద్యార్థులలో పరిశోధనాశక్తి పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జిజ్ఞాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుల పోటీలలో గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తయారుచేసిన ఇంగ్లీష్ ప్రాజెక్టు బోటనీ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు పోటీలకు సెలెక్ట్ అయ్యాయి. ఈ క్రమంలో మొదటగా విద్యార్థులు ఒక్కో ప్రాజెక్ట్ లో ఆరుగురు విద్యార్థులు.ఎంచుకున్న అంశం పై ప్రాజెక్టును సిద్ధం చేసి పి. పి. టి ద్వారా వివరిస్తున్న వీడియోలను రాష్ట్ర స్థాయి సెలెక్షన్ కమిటీకి పంపుతారు. ఇలా రాష్ట్ర లోని అన్ని (145) కళాశాలనుండి పంపిన ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి సెలెక్షన్ కమిటీ సభ్యులు పరిశీలించి, వడపోసి ఉత్తమ పరిశోధనా విలువలు కలిగిన నిత్య నూతనమైన ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. ఇలాంటి వాటిల్లో గోదావరిఖని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సిద్ధం చేసిన ఇంగ్లీష్ బోటనీ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. విద్యార్థి పరిశోధకులు మార్చి నెల 6 వ తేదీన నిర్వహించే పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటారు. ఇంగ్లీష్ ప్రాజెక్ట్ లో కళాశాల విద్యార్థులు వరుసగా యస్. లీలరాణి, యూ. నిక్షిత, ఏ. సాయి చరణ్, ఏ. శాంతి ప్రియ, ఏ. భువనేశ్వర్ పాల్గొనగా. బోటనీ ప్రాజెక్టులో వరుసగా ఏ. రజిత, ఏ. శ్రావణి, ఎన్. అక్షయ్, నదియా అంజుమ్ పాల్గొని ఈ ఘనత సాధించారు. ఇంగ్లీష్ ప్రాజెక్ట్ కు డా జి. సుబ్బారావు సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారు. డా ఏ సురేష్ సాంకేతికమైన సహాయం అందించారు. బోటనీ ప్రాజెక్ట్ కి శ్రీమతి పి సవిత సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ఘనత సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డా జై కిషన్ ఓజా. వైస్ ప్రిన్సిపల్ ఏ సాంబశివ రావు, జిజ్ఞాస కోఆర్డినేటర్ డా జి. శారద ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ప్రశంసిస్తూ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఆల్ ది బెస్ట్ అని శుభాకాంక్షలు తెలియజేసారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News