- జిల్లా కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ప్రెసిడెంట్ కేతిడీ దీపక్ రెడ్డి.
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఆదివారం 9.02.2025 రోజున హన్మకొండ కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ద్విచక్ర వాహనం ఆక్సిడెంట్ కాగా దారిలో వెళ్తున సుబేదారీ సీఐ సత్యనారాయణ రెడ్డి గమనించి వెంటనే 108 వాహనం కాల్ చేసి ఆక్సిడెంట్ అయిన వ్యక్తిని స్వయాన 108 లో ఎక్కించి హాస్పిటల్ కు తరలించడం జరిగింది. వెంటనే వారి ఇంటి సభ్యులకు సమాచారం తెలియ పరిచారు. తదుపరి వారి యోగ క్షేమాలు తెలుసు కున్నారు. ఈ సంఘటనకు వారు ప్రతి స్పందన అయిన విధానానీకై జిల్లా కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ప్రెసిడెంట్ కేతిడీ దీపక్ రెడ్డి సిఐ ని అభినందించి శాలువా తో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితో పాటు సాయి ప్రసన్న అభినై రెడ్డి నబీన్ అహ్మద్ అమిత్ కుమార్ పాల్గొన్నారు.





