Thursday, March 12, 2026

వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు కోసం వినతి పత్రం అందజేత

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల జిల్లా గొల్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వునర్వ్యవస్థీకరణలో భాగంగా గతంలో గొల్లపల్లి సహకార సంఘము పరిధిలోని 8 గ్రామాలను కలుపుకొని శ్రీరాములపల్లె ఇబ్రహీంనగర్ వద్ద సహకార సంఘము ఏర్పాటు చేశారు నోటిఫికేషన్ ప్రకటన 1895/2019-C/3 తేదీ: 20-01-2020 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘమును పునర్వ్యవస్థీకరించి, రెండు సంఘములుగా తెలంగాణ రాష్ట్ర సహకార సంఘముల చట్టం, 1964 నిబంధన 15-ఎ ప్రకారము శ్రీయుత ఉప రిజిష్టార్ జిల్లా సహకార అధికారి, జగిత్యాల ప్రకటన జారి చేయగా ఇట్టి ప్రకటనను అనుసరించి ఒకటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము లి. గొల్లపల్లి. మరియు రెండొవ ప్రాథమిక సహకార సంఘం శ్రీరాములపల్లి ఇబ్రహీంనగర్ గా ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శ్రీరాములపల్లి ఇబ్రహీంనగర్ వద్ద), మండలము గొల్లపల్లి లుగా వునర్వ్యవస్థీకరణ చేయుటకు గాను అభ్యంతరాలు తెలుపుటకు 21 రోజుల గడువు తరువాత పూర్తిస్థాయి సర్వే జరిగి రిపోర్టును సంబందిత అధికారులకు పంపగా ఇలాంటి అభ్యర్తనలు రాకపోవడంతో ఇట్టి శ్రీరాములపల్లి ఇబ్రహీంనగర్ సహకార సంఘానికి ఉద్యోగులను నియమించారు ఇట్టి సమయములో సహకార సంఘ ఎన్నికలు రావడముతో పాత ప్రకారము ఎన్నికలు నిర్వహించినారు. ఇట్టి శ్రీరాములపల్లి ఇబ్రహీంనగర్ సహకార సంఘానికి, అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యము కలదు. మరియు సొసైటీకి కావలసిన స్థలము కార్యాలయము కలదు. ఇట్టి శ్రీరాములపల్లి ఇబ్రహీం నగర్ సహకార సంఘ పరిధి లో కేటాయించిన 6 గ్రామాలకు వ్యవసాయ రైతు వేదిక కార్యాలయము కలదు. కావునా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతముగా ఉన్నది. కావునా పై విషయాలన్నింటిని ద్రుష్టియందు ఉంచి ఇట్టి శ్రీరాములపల్లి ఇబ్రహీంనగర్ ప్రాథమిక సహకార సంఘమును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు మంజూరి ఇప్పించగలరని కోరుతూ జిల్లా సబ్ రిజిస్టర్ సహకార అధికారి శ్రీ మనోజ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎఓ కు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, నేరెళ్ల గంగారెడ్డి మాజీ సర్పంచ్ ఇబ్రహీంనగర్ గారు , బోయపోతు గంగాధర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల్లపల్లి, పెంచాల తిరుపతి మాజీ సర్పంచ్ బీబీరాజ్ పల్లి, నిమ్మల జలుపతి రెడ్డి మాజీ రైతు బంధు సమితి అధ్యక్షుడు, మరియు రైతులు గడ్డం రాజేందర్ రెడ్డి,సాల్లూరి శోభన్ గౌడ్,గుండేటి తిరుపతి రెడ్డి శ్రీకోటి రఘుపతి, నేరెళ్ల కర్ణాకర్ రెడ్డి, పల్లెర్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News