Wednesday, March 25, 2026

చదువుకు సంస్కారం కలిస్తేనే విజయం వరిస్తుంది

నేటి సాక్షి, మెట్ పల్లి : చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు వినయం కలిస్తేనే ఎంచుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని విశ్రాంత ప్రిన్సిపాల్, రచయిత, కాలామిస్ట్ డా: బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెట్‌పల్లి తెలంగాణ మైనారిటీ పాఠశాల,మరియు జూనియర్‌ కళాశాల కు అయన ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులతో మాట్లాడుతూ సైన్స్‌ రంగంలో పరిశోధనలు చేసే స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా కృషి చేయాలని అన్నారు. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థుల్లో మానసిక ఆందోళన పెరిగిందని, భయం వీడితేనే సత్ఫలితాలు అందుతాయని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ రంగాల్లో నిష్ణాతులైన యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ప్రతి పరీక్షలో కొంత ఎక్కువ మార్కులను సాధిస్తూ తమ రికార్డును తానే బ్రేక్‌ చేస్తూ ఎదగాలన్నారు. ఇంటర్‌లో తొమ్మిది వందల మార్కులు,పదవ తరగతిలో 9.0 గ్రేడ్‌ దాటిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం, విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందిస్తామని ప్రకటించారు.సభాధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ కనకం తిరుపతి తమ కళాశాల విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేసారు. మెట్‌పల్లి లయన్స్ క్లబ్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌, నాయకులు వేణుగోపాల్ కూడా పాల్గొని మాట్లాడారు. ఈ వేదిక మీద రాజరాజేశ్వర లయన్స్ క్లబ్ సౌజన్యంతో పదవ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు వంద మందికి పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్స్, స్కేల్స్‌ అందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News