
పెగడపల్లి :నేటిసాక్షి (కె గంగాధర్ )
పెగడపల్లి మండలం లోని బతికేపల్లి గ్రామానికి చెందిన నిరుపేద బొమ్మేన రాజయ్య (46) వృత్తి రీత్యా గల్ఫ్ దేశం వెళ్ళేవాడు ఇటీవల వచ్చినా రాజయ్య అనారోగ్యం తో బాధపడుతూ పలు ఆసుపత్రులు తిరిగాడు ఐనా కానీ అతనికి ఆరోగ్యం బాగు అవకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు అది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రి కి తరలించారు అప్పటికే ఆరోగ్యం విషమించడం తో గత కొద్దిరోజులుగా ఆసుపత్రి లో వున్నాడు ఈ రోజు ఉదయం ఆరోగ్యం పూర్తిగా విషమించడం తో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడని ఎస్ ఐ రవి కిరణ్ తెలిపారు మృతునికి భార్య, కుమారుడు, కూతురు వున్నారు

