నేటి సాక్షి, మందమర్రి:- జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన మూడవ జాతీయ ఓపెన్ కరాటే చాంపియన్షిప్ లో పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థి సునార్కర్ బాలాజీ గ్రూప్ కట లో మొదటి స్థానం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎం రమేష్ మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన ఓపెన్ కరాటే చాంపియన్షిప్ లో అసాధ్యమైన మార్షల్ ఆర్ట్స్ ను ప్రదర్శించి బాలాజీ గ్రూప్ కట లో మొదటి స్థానం సాధించడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. బాలాజీ భవిష్యత్తులో అత్యుత్తమ విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, బాలాజీకి అభినందనలు తెలియజేశారు.




