- నేడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్
- తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర
- పట్టభద్రుల చూపు రాజసుమన్ వైపు
నేటి సాక్షి, (రియాజ్):
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ ధాఖలు ఈ నెల 10తో ముగుస్తుండటంతో అభ్యర్థులు కసరత్తు ముమ్మురం చేశారు. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా క్రియాశీలక నేతలు పోటీపడుతుండగా వీరిలో నుంచే ఎమ్మోల్సీగా గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించక పోవడంతో స్వతంత్ర అభ్యర్థులల్లో పోటీ నెలకొంది. ఈ ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడనుండటంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థికి గెలుపు ఆవకాశాలు ఆధికంగా ఉండనున్నాయి. ఇందులో బీఆర్ఎస్ ఆశావాహుల్లో ఒకరితో పాటు, డా. సుంకిసాని రాజసుమన్ రావు పేరు బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తను నిర్వర్తిస్తున్న ఫిజియోథెరపీ డాక్టర్ వృత్తిని వదిలి పోరాటం సాగించిన రాజసుమన్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఎదిగి కేసీఆర్, కేటీఆర్ లకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ప్రస్థుతం జగిత్యాల జిల్లా గొల్లపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యకులుగా, ఫోరం జిల్లా అధ్యక్షులుగా, ఫిజియోథెరపీ వైద్యుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో యువతకు అండగా సాగించిన పలు సామాజిక సేవా కార్యక్రమాలు, మరో వైపు వైద్యవృత్తిలో అందించిన సేవలు, రాజకీయాల్లో నెలకొన్న సత్సంబందాలు ప్రస్తుతం తనకు కలిసివచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మచ్చలేని నాయకుడిగా సుపరిచితుడైన డా.సుంకిసాని రాజసుమన్ ఎమ్మెల్సీ బరిలో నిలవడంతో పట్టభద్రుల చూపు తనపై పడిందనే చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఒకరకంగా అనధికార అభ్యర్థిగానే రాజసుమన్ బరిలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ క్రింది స్థాయి నాయకత్వం మద్దతు తెలిపే ఆవకాశం ఉండనుంది! తనపై నమ్మకంతో పట్టభద్రులు ఓటు వేసి ఎమ్మెల్సీ గా గెలిపిస్తే, శాసన మండలిలో పట్టభద్రుల కు అండగా గళం విసిపించి, సమస్యల పరిష్కారంకై ప్రభుత్వంతో పోరాటం సాగిస్తానని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ దిశగా ఇప్నటికే పలు ప్రాంతాల్లో పట్టభద్రులతో సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. కాగా నేడు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేస్తున్నందున పట్టభద్రులు వేలాదిగా తరలిరావలని రాజసుమన్ పిలుపినిచ్చారు.





