Tuesday, March 24, 2026

అధికారుల బలంతో సూపర్వైజర్ల ఆగడాలు

  • ప్రైవేటు సెక్యూరిటీ గార్డులపై కక్ష్య సాధింపు చర్యలతో రోజుల తరబడి డ్యూటీలు ఆపుతున్న సూపర్వైజర్లు
  • ఏరియా జిఎం స్పందించి తగిన న్యాయం చేయాలని జిఎం కార్యాలయం ఎదుట ధర్నా
  • సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్

నేటి సాక్షి, మందమర్రి :- మందమర్రి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డులపై అధికారుల అండదండలతో సూపర్వైజర్ల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూనిర్వస్థితుడైన బానోతు రాజేందర్ అనే సెక్యూరిటీ గార్డుకు నైట్ డ్యూటీ లేదంటే రిలీవర్ గా వేయ్యడంతో మానసికంగా భాధపడుతూ సూపర్వైజర్ కు ఫోన్ చేసి మాట్లాడితే భాధ్యతరహితంగా మాట్లాడటంతో అవేధనతో మాటమాట అనుకోవడం జరిగిందని, ఇది డ్యూటిలో జరిగిన అంశమే కాకపోయిన ఏలాంటి సమాచారం ఇవ్వకుండా డ్యూటీని ఆపడం జరిగిందని అన్నారు. ఏందుకు డ్యూటీకి తీసుకోవడం లేదని అడిగితే మాకు ఏమి తెలియదు ఏఎస్ఓ ను కలవమని చెప్పడంతో వెళ్లి ఏఎస్ఓ ను కలిస్తే తనకు సంబంధం లేదని, కాంట్రాక్టర్ తీసుకోమ్మంటే డ్యూటీకి రా అంటు పంపించారని, తర్వాత కాంట్రాక్టర్ ను కలిస్తే అసలు తనకు విషయమే తెలియదు సరే ఏదైనా ఉంటే లెటర్ రాసిచ్చి డ్యూటీకి రమ్మని చెప్పడంతో సూపర్వైజర్ కు లెటర్ ఇస్తే తీసుకోని తనకు కాంట్రాక్టర్ ఇంకా ఏమి చెప్పలేదని, మళ్లీ ఇప్పుడే చెప్పుతానని అంటు 2 రోజులుగా తిప్పుతున్నారని తెలిపారు. చివరకు భూనిర్వస్థితుల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే సాధారణ గార్డుల పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకోవచ్చుని అన్నారు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు విషయంలో ఓ దొరల పెత్తనంలా కొనసాగుతుందని, దీనిని నిరసిస్తూ మందమర్రి సీఎం కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేసి పర్సనల్ మేనేజర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని పర్సనల్ మేనేజర్ తెలిపారని అన్నారు. భూనిర్వస్థితుల విషయంలో ఉద్యోగులు కల్పిస్తునే ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలతో ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదని, గార్డును వెంటనే డ్యూటీకి తీసుకోకుంటే శాంతిఖని గనిలో ఏర్పాటు చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో సైతం అధికారులు దృష్టికి తీసుకెళ్లుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సికేస్ సిఐటియు శ్రీరాంపూర్ బ్రాంచి కార్యదర్శి గట్టు మహేందర్, బానోతు రాజేందర్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News