Monday, July 21, 2025

సర్జరీ విజయవంతం

సర్జరీ విజయవంతం చేసిన వైద్య బృందానికి అభినందనలు

– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహించినందుకు గాను వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన 45 సంవత్సరాల మహిళ గత 3 సంవత్సరాలుగా గర్భ సంచిలో పెద్ద గడ్డలతో బాధ పడిందని, ప్రభుత్వ ఆసుపత్రి కు స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు చేయగా జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పర్యవేక్షణ లో వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి దాదాపు కేజీ నర యూటిరైన్ ఫాబ్రియార్డ్స్ ద్వారా 2 గడ్డలు, గర్భ సంచిని తొలగించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు డాక్టర్ అనసూయ, డాక్టర్ శౌర్య, డాక్టర్ శ్రీధర్ లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.జిల్లా ఆసుపత్రిలో గర్భసంచి సమస్యలకు సంబంధించిన శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని, అవసరమైన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News