- రేషన్ కార్డుల జారీకి కుటుంబ ఆర్థిక స్థితులను పరిగణాల్లోకి తీసుకోవాలి
- జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి
నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్) : ఇటువంటి పొరపాట్లు జరగకుండా పగడ్బందీగా సర్వే వివరాలను నమోదు చేయాలని అలాగే రేషన్ కార్డుల జారీకి కుటుంబ ఆర్థిక స్థితులను పరిగణలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రమెల సత్పతి మండలాధికారులను ఆదేశించారు. సోమవారం రామడుగు మండలంలోని వెదిర, గోపాల్ రావు పేట గ్రామాలలో అధికారులు చేపడుతున్న సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్మాణాలు ఉన్న స్థలాలు, కోళ్ల ఫామ్స్, రైస్ మిల్లులు లాంటి పరిశ్రమలు ఉన్న స్థలాల వివరాలు నమోదు చేయవద్దని వివరించారు. అలాగే ఇందిరా ఆత్మీయ భరోసా పథకం కోసం 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజుల ఉపాధి హామీ పనిచేసిన భూమిలేని కూలీలని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, చొప్పదండి ఏ డి ఏ ప్రియదర్శిని, ఎంపీడీవో రాజేశ్వరి, ఎమ్మార్వో వెంకటలక్ష్మి,ఏవో త్రివేదిక పాల్గొన్నారు.




