Monday, March 23, 2026

ఎస్ వి యు రిటైర్డ్ టైం స్కేల్ ఉద్యోగుల బాధలు అర్థం చేసుకోండి

  • 60 నుంచి 62 సంవత్సరాలు వయోపరిమితి పెంచండి
  • ఏపీ సీఎం నారా చంద్రబాబు మంత్రి లోకేష్ బాబుకు ఎస్ వి యు రిటైర్డ్ టైం స్కేల్ ఉద్యోగుల విజ్ఞప్తి

నేటి సాక్షి తిరుపతి న్యూస్ తిరుపతి ప్రతినిధి డాక్టర్ శివ తిరుపతి : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లుగా 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ లేకపోవడంతో మా కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని, కనీసం 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు వయో పరిమితి పెంచితే సంతోషం గా ఉంటుందని, ఎస్ వి యు నాన్ టీచింగ్ టైమ్ స్కేల్ ఉద్యోగుల సంఘం సభ్యులు, ఎస్ వి యు రిటైర్డ్ టైం స్కేల్ ఉద్యోగులు డి ఎం విజయ చంద్ర నాయుడు, కే రెడ్డప్ప రెడ్డి, ఏ రమేష్ బాబు జి నాగరాజు బి సిద్దయ్య టి.కె వెంకటరమణ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి లోకేష్ బాబుకు విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డి ఎం విజయ చంద్ర నాయుడు మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా టైం స్కేల్ ఉద్యోగులకు సమాన వేతనము లేదని, అలాగే రిటైర్డ్ అయిన తర్వాత ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం 60 నుండి 62 సంవత్సరాలు పర్మినెంట్ ఉద్యోగులకు వయోపరిమితి పెంచారని టైమ్ స్కేల్ ఉద్యోగులను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ టైం స్కేల్ ఉద్యోగులను గుర్తించి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు రెండు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచాలని కోరారు. ఇప్పటికే రిటైర్డ్ టైమ్ ఉద్యోగులకు రెండు సంవత్సరాలు వయోపరిమితిని పెంచాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబును కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా గత 30 సంవత్సరాలు గా జూనియర్ అసిస్టెంట్లుగా విధి నిర్వహణలో సైనికులు పనిచేస్తున్నామని, సెలవు రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. తాము రిటైర్డ్ న గత ఆరు నెలల నుండి ఎటువంటి ఆధారం లేకపోవడంతో టైం స్కేల్ ఉద్యోగులు, కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రిటైర్డ్ టైం స్కేల్ ఉద్యోగుల చిరు కోరికలను మన్నించి న్యాయం చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News