Wednesday, April 23, 2025

ప్రొఫెసర్ నరసయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

నేటి సాక్షి తిరుపతి ప్రతినిధి డాక్టర్ శివ : విద్యార్థుల సహకారంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి
తిరుపతి: విద్యార్థుల భాగస్వామ్యంతోనే విశ్వవిద్యాలయ అభివృద్ధి సాధ్యమని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) ఇన్‌చార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు అన్నారు. శనివారం కాలేజ్ ఆఫ్ కామర్స్, మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.వి. నరసయ్య ఆధ్వర్యంలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అప్పారావు పాల్గొని మాట్లాడుతూ యూనివర్సిటీ పరిసరాలను మరింత భద్రంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు విద్యార్థుల సహకారం కీలకమని పేర్కొన్నారు. ఇటీవల యూనివర్సిటీ పరిధిలో చిరుత సంచారం పెరుగుతున్న నేపథ్యంలో అరికట్టేందుకు కాలేజ్ ఆఫ్ కామర్స్, మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో పెరిగిన దట్టమైన పొదలను తొలగించి, స్తంభాలు నాటి కంచె వేసి యూనివర్సిటీ హద్దులను పునరుద్ధరించినట్లు తెలిపారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు మాట్లాడుతూ… చిరుత సంచారంపై సమగ్ర చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల రక్షణ కోసం అటవీ శాఖ, విశ్వవిద్యాలయం సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.వి. నరసయ్య మాట్లాడుతూ, పరిశుభ్రత పాటించడం ద్వారా అటవీ జంతువుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం అనేది వారి బాధ్యతగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రొఫెసర్ రమేష్ బాబు పర్యవేక్షించగా, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ అంజన్ బాబు, అకడమిక్ కన్సల్టెంట్స్, పీహెచ్డీ స్కాలర్లు, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.కామ్ విద్యార్థులు పాల్గొన్నారు. “పరిసరాల సంరక్షణ – విద్యార్థుల భాగస్వామ్యం” అనే సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News