- వారికి కిట్లను అందించి సన్మానించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల): పాకాల, జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుండి మండల, డివిజన్, మునిసిపల్ స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు అంకిత భావంతో భాగస్వాములు కావాలని అప్పుడే స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ తిరుపతి సాకారం అవుతుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు. ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పాకాల పంచాయతీ పాకాల నందు సంబంధిత ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని అన్ని వర్గాల వారు అన్ని పంచాయతీలలో గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు తదితర విభాగాలలో అంకిత భావంతో పాల్గొని జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలనితెలిపిన ఎమ్మెల్యే గారు.ప్రతినెల మూడో శనివారం మనకి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక్కో రకమైనటువంటి థీమ్ తో,రెండో నెల ఫిబ్రవరి మాసంలో సోర్స్-రిసోర్స్ థీమ్ తో కార్యక్రమాన్ని మనం చేపడుతున్నామని, గత నెల నుండి ఈ కార్యక్రమం నిర్వహించు కుంటున్నామని పేర్కొన్నారు. తడి చెత్త – పొడి చెత్త పై ప్రజలకు ఎమ్మెల్యే అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని చెత్తను తడి చెత్త, పొడి చెత్త న తడి వేరు చేసి వారి ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలని, అందుకొరకు బుట్టలు అందిస్తున్నామని, అందని వారికి త్వరలో అందిస్తామని అన్నారు. తప్పకుండా ఇలా చెత్తను వేరు చేసి వేర్వేరు బుట్టల్లో లేదా బ్యాగుల్లో వేసి చెత్త కలెక్షన్ కొరకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలని కోరారు. తడి పొడి చెత్తంతా కలిపి ఒకే దాంట్లో వేస్తే వాటిని విడదీయడానికి చాలా ఇబ్బంది అవుతుందని, ప్లాస్టిక్ కవర్లు వాడితే అవి మట్టిలో కలిసిపోవని, అలాగే సంవత్సరాల తరబడి భూమి పొరల్లో ఉండిపోతాయని, తద్వారా పర్యావరణం దెబ్బ తింటుందని అన్నారు.ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ అవకాశాలు ఉన్నాయని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఉంటే చెత్త పేరుకుపోయి దోమలు ఈగలు పెరుగుతాయని, దోమల వల్ల మలేరియా డెంగ్యూ లాంటి పలు జ్వరాలు, టైఫాయిడ్ కలరా వంటి రోగాలు ప్రబలుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆకుపచ్చ రంగు చెత్త బుట్టలో తడి చెత్త వెయ్యాలని సోదాహరణంగా చెపుతూ మిగిలిన అన్నం, కూరలు, మిగిలిపోయిన మాంస పదార్థాలు, అన్నం తిన్న తర్వాత మిగిలిన వ్యర్ధాలు పువ్వులు, కొబ్బరి పీచు, కూరగాయలు, తొక్కలు, కోడిగుడ్డు పెంకులు, పనికిరాని చీపుర్లు, కాంచిన టీ కాఫీ పొడి వంట గదిలో ఉత్పత్తి అయ్యే వ్యర్ధపదార్థాలు పెరటి నుండి మరియు పంట నుంచి వచ్చే ఆకులు మొక్కలు పండ్ల తొక్కలు, పచ్చగడ్డి, ఎండు గడ్డి తదితరాలను తడి చెత్త బుట్టలో వేయాలని సూచించారు. పొడి చెత్తను నీలం రంగు బుట్టలో సంచుల కవర్లు, గాజు సీసాలు పనికిరాని గుడ్డ ముక్కలు, గాజు సీసాలు, చెప్పులు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా సబ్బు,షాంపు,గుట్కా, బిస్కెట్ పాల కవర్లు, పాడైన బ్యాటరీలు,ఎలక్ట్రిక్ వస్తువులు పనికిరాని నోటు పుస్తకములు, అట్టలు, అట్ట పెట్టెలు, ధర్మకోల్ వస్తువులు, బల్బులు ట్యూబ్ లు, ట్యాబ్లెట్ కవర్లు టూత్ పేస్ట్ పౌడర్ ఆయిల్ డబ్బాలు, అన్ని రకాల ప్లాస్టిక్ పదార్థములు తదితరాలు అని తెలిపారు. రానున్న కాలంలో ప్రమాదకరమైన పదార్థాలు పెయింట్స్ మరియు ద్రావకాలు మోటర్ ఆయిలు, పాదరసం కలిగిన వ్యర్ధాలు, పురుగు మందులు, కలుపు సంహారకాలు, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్లు టెలివిజన్ మొబైల్ ఫోన్, రిఫ్రిజిరేటర్ ల భాగాలు, బ్యాటరీలు, మందు గుండు సామాగ్రి, కారు బ్యాటరీలు తదితరాలు ప్రమాదకరమైన వ్యర్థాలుగా ఎరుపు రంగు బుట్టలలో వేయాల్సి ఉంటుంది అని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే గారు అధికారులు, ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ… ఈరోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.ఈ కార్యక్రమంలో జిల్లా,మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.





