Friday, April 3, 2026

హుజూరాబాద్ లో స్వచ్ఛ సర్వేక్షన్ – 2025

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): ప్రభుత్వము వారు ప్రతీష్టాత్మకముగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ – 2025 కార్యక్రమములో భాగంగా, హుజూరాబాద్ పట్టణమును స్వచ్చ హుజూరాబాద్ గా తీర్చిదిద్దుటకు గాను ప్రజలెవ్వరు కూడా చెత్తను రోడ్ల పై వేయకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించుటకు గాను పురపాలక సంఘ కమిషనర్ కెంసారపు సమ్మయ్య ఆధ్వర్యములో తేదీ: 21-03-2025 రోజున పట్టణములోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వచ్చ భారత్ స్వచ్చ హుజూరాబాద్ కార్యక్రమమును నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమమునకు హుజూరాబాద్ పురపాలక సంఘ ప్రత్యేక అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ (L.B.), కరీంనగర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిధిగా హాజరై, అంబేద్కర్ చౌరస్తా వద్ద మొక్కలను నాటి, వేసవి కాలము దృష్ట్యా చౌరస్తా వద్ద నూతనముగా ఏర్పాటు చేసిన చలివేంద్రమును మరియు ఇంటింటికీ చెత్త సేకరణ కొరకు నూతనముగా కొనుగోలు చేసిన స్వచ్చ ఆటోలను, తడి-పొడి చెత్తను వేరువేరుగా సేకరించుటకు చెత్త డబ్బాలను ప్రారంభించడం జరిగినది. తదుపరి, అంబేద్కర్ చౌరస్తా నుండి సూపర్ బజారు మీదుగా ర్యాలీగా బయలుదేరి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానము నందు ఏర్పాటు చేసిన స్వచ్చ హుజూరాబాద్ కార్యక్రమములో హుజూరాబాద్ వాకర్స్ అసోసియేషన్, మహిళా సంఘాలు, పాఠశాలల విద్యార్థినీ-విద్యార్థులు మరియు పట్టణ ప్రజలకు తడి-పొడి చెత్తలను వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాలను గురించి అవగాహన కల్పిస్తూ, ప్రతిరోజూ కూరగాయలను, కిరాణ సామాగ్రీని కొనుగోలు చేయుటకు బట్ట సంచులను మాత్రమే వినియోగించాలని వివరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమము నందు కమిషనర్ కెంసారపు సమ్మయ్య గారు, IEC Expert ఫణి, అంగన్ వాడీ సూపర్ వైజర్ పద్మ, మున్సిపల్ ఇంజనీర్ జి. సాంబరాజు, కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జె. శ్రీకాంత్, MD. రషీద్, సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, మెప్మా CLRP & RPలు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్, కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్, పట్టణ ప్రజలు మరియు పురపాలక సంఘ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News