కరీంనగర్ : ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రముఖ ఆరోగ్య బీమా సలహాదారు సయ్యద్ ఇమామ్ షకీర్ అలీకి ప్రతిష్ఠాత్మక లఖపతి అవార్డ్ ఆఫ్ అప్ప్రిషియేషన్ ని ప్రదానం చేసింది. ఈ అవార్డును తెలంగాణ ఏరియా మేనేజర్ నాగార్జు నందగిరి, కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ విశ్ణు ప్రసాద్, ఎండి కలీముద్దీన్, రాజశేఖర్ కలిసి అందజేశారు. సయ్యద్ ఇమామ్ షకీర్ అలీ ఆరోగ్య బీమా రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. కస్టమర్ల ఆరోగ్య అవసరాలను అంచనా వేసి, వారికి అనుగుణంగా వివిధ బీమా ప్రణాళికలను సూచించడం, పాలసీల నిబంధనలు మరియు షరతులను సవివరంగా వివరిస్తూ కస్టమర్లకు పూర్తి స్పష్టతను కల్పించడం ఆయన సేవల ప్రత్యేకత. ఆరోగ్య బీమా యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ, శిక్షణ మరియు సలహా ద్వారా ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెంపొందించడంలో సయ్యద్ ఇమామ్ షకీర్ అలీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ అవార్డు ఆయన సమర్పణకు గుర్తింపుగా నిలిచింది.

